Wednesday, May 29, 2024

Telangana – లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 12 స్థానాలు – ఈటల

కాంగ్రెస్ ప్రభుత్వంపై తక్కువ సమయంలోనే వ్యతిరేకత వచ్చిందని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. దేశ ప్రజలకు నాయకత్వం వహించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందన్నారు. దేశంలో ఎక్కడకు వెళ్లినా మోదీ కావాలని అంటున్నారని పేర్కొన్నారు. పట్టభద్రులు కూడా మోదీ వైపే చూస్తున్నారన్నారు. నల్గొండ-ఖమ్మం-కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. తెలంగాణ యువత ప్రధాని మోదీ పట్ల ఆకర్షితులయ్యారన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలు సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 12 స్థానాలు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ స్థానం నుంచి అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నామని జోస్యం చెప్పారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement