Wednesday, February 1, 2023

నేటి బాలలే రేపటి పౌరులు : మంత్రి ఎర్ర‌బెల్లి

నేటి బాల‌లే రేప‌టి పౌరులు అనే మాట‌ను సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నార‌ని, బాలల భవిష్యత్‌కు సీఎం కేసీఆర్‌ బంగారు బాటలు వేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని కస్తూర్బా స్కూల్‌తో పాటు ప్రభుత్వ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. శిశువు గర్భంలో పడినప్పటి నుంచి పెరిగి పెద్దయ్యే వరకు ప్రతి దశలో తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలబడుతూ వారి సమగ్ర వికాసానికి కృషి చేస్తోందన్నారు. బాలలు పరిమళించే గులాబీలని, వారి హక్కులను కూడా కాపాడాలని ప్రజలను కోరుతున్నామన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చెప్పినట్లు విని బాగా చదివి.. ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement