Thursday, March 30, 2023

లారీ డ్రైవర్‌ అనుమానాస్పద మృతి

భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రిలయన్స్ పెట్రోల్ పంపు సమీపంలోని అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో లారీ డ్రైవర్ మృతి చెందిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. మృతుడు గణపురం మండలం మైలారం గ్రామానికి చెందిన రావుల సంతోష్ (27)గా గుర్తించారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కథనం ప్రకారం రావుల సంతోష్ గత కొద్ధి సంవత్సరాలుగా లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడని, శుక్రవారం ఉదయం లారీ రిపేర్ ఉందని ఇంటి నుండి భూపాలపల్లికి వెళ్లినట్లు తెలిపారు. శుక్రవారం రాత్రి వరకు ఇంటికి రాలేదని తెలిపారు. అయితే లారీ ఉన్న ప్రాంతానికి మృతి చెందిన ప్రాంతానికి చాలా దూరం ఉండటం, ముఖం, శరీరం పై గాయాలు ఉండడంతో ఎవరో హత్య చేసి ఉంటారాని భావిస్తున్నారు. మృతుడు గ్రామంలో అందరితో కలుపుగోలుగా ఉండేవాడిని ఇలాంటి విభేదాలు కూడా లేవని చెబుతున్నారు. సంతోష్ మృతితో మైలారంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న భూపాలపల్లి ఎస్సై రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement