Thursday, March 28, 2024

రూ.325కోట్లు వ‌సూళ్ల‌తో దూసుకుపోతోన్న -పొన్నియిన్ సెల్వ‌న్

ఎనిమిది రోజుల్లోనే 325కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూలు చేసింది పొన్నియిన సెల్వ‌న్ చిత్రం.ఈ చిత్రానికి మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.బాక్సాఫీస్ వద్ద మంచి వ‌సూళ్లు సాధిస్తోంది. ఈ సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్ల మార్క్‌కు చేరువలో ఉంది. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం పీఎస్‌1 తొలి వారంలో అద్భుత‌మైన బిజిజనెస్ చేసింది. సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా తమిళ్‌, హిందీ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో విడుద‌లైంది. ఈ వారాంతంలో 350 కోట్ల మార్కు దాటుతుంద‌ని అంచ‌నా వేశారు.ర‌జ‌నీకాంత్ రోబో 2.0, కబాలి, బిగిల్, విక్రమ్ తర్వాత 300 కోట్ల క్లబ్‌లో చేరిన ఆరో తమిళ సినిమా ఇదేనని త్రినాథ్ తెలిపారు. కబాలి, 2.0 ఓవ‌రాల్‌ బాక్సాఫీస్ కలెక్షన్లను అధిగమించిన ఈ చిత్రం విక్ర‌మ్ రికార్డును కూడా బ్రేక్ చేసే దిశ‌గా ముందుకెళ్తోంది. విదేశాల్లోనూ పీఎస్‌1 హ‌వా కొన‌సాగుతోంది. యూఎస్ ఏలో ఈ చిత్రం 5 మిలియ‌న్ల క్ల‌బ్‌లో చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement