Tuesday, May 14, 2024

తెలంగాణ రాష్ట్రంపై కక్ష సాధిస్తున్న కేంద్రం: ముత్తిరెడ్డి ఆగ్రహం

తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం కక్ష సాధిస్తున్నదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయం ఎదుట కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాన్ని పాలిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్.. రాష్ట్రాలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రైతాంగపై వరి ధాన్యం కొనుగోలు చేయలేమని చెప్పడం మూర్ఖత్వము చర్యని విమర్శించారు. ఆహార భద్రత చట్టం ప్రకారం తప్పనిసరి రైతుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాడ్ చేశారు. తెలంగాణ నుండి పన్నుల రూపేణా రెండు వందల ఎనభై లక్షల కోట్లు కేంద్రానికి చెల్లించామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement