Wednesday, May 22, 2024

HYD: రీహాబిలిటేషన్ సెంటర్ కోసం చేతులు కలిపిన కేర్ హాస్పిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్

హైద‌రాబాద్ : భారతదేశంలో సుప్రసిద్ధ మల్టి స్పెషాలిటీ హాస్పిటల్ చైన్ గా వెలుగొందుతున్న కేర్ హాస్పిటల్స్, తమ బంజారాహిల్స్ యూనిట్ లో అత్యాధునిక స్పోర్ట్స్ మెడిసిన్, రీహాబిలిటేషన్ సెంటర్ ప్రారంభించటం ద్వారా ఒక ప్రతిష్టాత్మక మైలురాయిని చేరుకుంది. అథ్లెట్స్, చురుకైన జీవనశైలి కలిగిన వ్యక్తుల కోసం ప్రత్యేకీకరించిన ఆరోగ్య సంరక్షణ లో మార్పును ఈ కేంద్రం తీసుకురానుంది.

ఈ కేంద్రాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్స్ – హెన్రిచ్ క్లాసేన్, మార్కో జాన్సెన్, నితీష్ కుమార్ రెడ్డి, షాబాజ్ అహమ్మద్ లు వరుణ్ ఖన్నా – గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్, క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్, జస్దీప్ సింగ్ – గ్రూప్ సీఈఓ, కేర్ హాస్పిటల్స్, డాక్టర్ సంజీబ్ కుమార్ బెహ్రా, హెచ్ ఓ డి – ఆర్థోపెడిక్స్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్, ఇతర క్లినికల్ నిపుణులు, అతిధుల సమక్షంలో ప్రారంభించారు.

ఈసంద‌ర్భంగా క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ వ‌రుణ్ ఖ‌న్నా మాట్లాడుతూ… తాము స్పోర్ట్స్ మెడిసిన్, రీహాబిలిటేషన్ ను పునర్నిర్వచించే ప్రయాణం ప్రారంభించామన్నారు. కేవలం అథ్లెట్స్ మాత్రమే కాదు, చురుకైన జీవన శైలిని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికీ ఇది సేవలను అందించనుందన్నారు. కేవలం గాయాలకు చికిత్స అందించటం మాత్రమే కాకుండా, నివారణ పై దృష్టి సారించటం , రీహాబిలిటేషన్, మెరుగైన ప్రదర్శన కనబరచడంలో తోడ్పడటంతో సహా సమగ్రమైన సంరక్షణ అందించడం పై తాము దృష్టి సారించామన్నారు.

- Advertisement -

కేర్ హాస్పిటల్స్ సీఈఓ జస్దీప్ సింగ్ మాట్లాడుతూ… ఈ ప్రారంభంతో స్పెషలైజ్డ్ కేర్ లోని ఖాళీలను పూరించటం తాము లక్ష్యంగా చేసుకున్నామన్నారు. అథ్లెట్స్, చురుకైన జీవనశైలి కలిగిన వ్యక్తులు, వారు వున్న ప్రాంతాలతో సంబంధం లేకుండా అవసరమైన మద్దతు అందుకోగలరని భరోసా అందిస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement