Tuesday, May 28, 2024

AP | అందరికీ థాంక్స్ : జగన్..

ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు సోమవారం పోలింగ్ జరిగింది. ఏపీలో ఎన్నికలు ముగియండంతో ఫలితాలపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఈ క్రమంలో పోలింగ్ పై సీఎం జగన్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘నిన్న జరిగిన ఎన్నికల్లో మండుటెండలు సైతం లెక్కచేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీలా తరలివచ్చిన నా అవ్వతాతలకు నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా రైతన్నలకు, నా ఎస్సీ, నా ఎస్టీ, ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకు, నా యువతీ యువకులందరికీ పేరు పేరునా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన వైసీపీ గెలుపుకోసం చెమటోడ్చి శ్రమించిన నా కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పటివరకు సాగిన మన సుపరిపాలన, మరింత మెరుగ్గా కొనసాగుతుందని హమీ ఇస్తున్నాను’ అని జగన్ ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement