Monday, June 10, 2024

TS: ఏజెన్సీలో పోలీసుల హై అలర్ట్.. సరిహద్దు గ్రామాల్లో ముమ్మర తనిఖీలు

వాజేడు, మే 11 ప్రభ న్యూస్ : నిన్న మావోయిస్టు కరపత్రాలు వెలుపడిన నేపథ్యంలో మారుమూల‌ ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లా వాజేడు మండలంలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. తెలంగాణ- ఛ‌త్తీస్ ఘ‌డ్ సరిహద్దు గ్రామాలైన కృష్ణాపురం, దూలపురం గ్రామ సరిహద్దుల్లో వాజేడు ఎస్సై వెంకటేశ్వర్లు, పేరూరు ఎస్సై రమేష్ ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. అటువైపు వెళ్లే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ప్రయాణికుల బ్యాగులను సైతం తనిఖీ చేస్తున్నారు.

మావోయిస్టు కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు బలగాలను మోహరింపజేసి మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో గస్తీ తిరుగుతున్నారు. లోక్ స‌భ‌ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏజెన్సీ గ్రామాల్లో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. దీనిలో భాగంగానే ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించి తనిఖీలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ జవాన్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement