Monday, May 20, 2024

TS: ఏజెన్సీలో మావోయిస్టు కరపత్రాలు కలకలం..

దగాకోర్ పార్లమెంట్ ఎన్నికల్లో బహిష్కరించండి
కరపత్రాల్లో పొందుపరిచిన మావోయిస్టు
వాజేడు, మే 10 ప్రభ న్యూస్ : పార్లమెంట్ ఎన్నికల వేళ‌ మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని దూలపురం సుందరయ్య కాలనీ జగన్నాపురం వై జంక్షన్ నుండి మురుమూరు గ్రామాల వరకు రహదారి పొడవున భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు వాజేడు వెంకటాపురం ఏరియా కమిటీ పేరున కరపత్రాలు వెలిశాయి. ఆ కరపత్రాలలో ఈ విధంగా పొందుపరిచారు..

దగాకోర్ పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించండి, బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్ట్ బిజెపిని, దానితో అంట కాగుతున్న పార్టీలను అన్నింటిని తన్ని తరిమి కొట్టండి, బ్రాహ్మణీయ హిందుత్వ పాసిస్ట్ ప్రమాదం నుండి దేశాన్ని భారత నూతన విప్లవాన్ని పురోగమింప చేయండి. ప్రజల విప్లవ రాజకీయాన్ని స్థాపించండి. హిందుత్వమయం చేసి అశాస్త్రీయ, అహేతుకత, అవివేకం, వెనుకబాటు తనానికి తీసుకువెళుతున్న నూతన విద్య విధానాన్ని రద్దుచేసి, శాస్త్రీయ విద్య విధానాన్ని కామన్ స్కూల్ విద్యా విధానాన్ని అమలు చేయాలని కరపత్రంలో పొందుపరచడం జరిగింది.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రజల కంట పడకుండా ముందస్తుగానే తొలగించినట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల వేళ మావోయిస్టు కరపత్రాలు కలకలం రేపడంతో ఏజెన్సీ ప్రాంతంలో భ‌యానక వాతావరణం ఏర్పడింది. ఒకవైపు గత నెల రోజులుగా పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టడం. మరోవైపు మావోయిస్టు కరపత్రాలు వెలువడటంతో ఏక్షణం ఏం జరుగుతుందోనని ఏజెన్సీ ప్రాంత వాసులు భయాందోళనకు గురవుతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement