Monday, May 20, 2024

Delhi: క‌విత బెయిల్ పిటిష‌న్ విచార‌ణ‌.. ఈనెల 24కి వాయిదా

బెయిల్ తిర‌స్క‌ర‌ణ‌పై హైకోర్టులో క‌విత స‌వాల్
విచార‌ణ‌కు స్వీక‌రించిన హైకోర్టు
మ‌ధ్యంత‌ర బెయిల్ అంశాన్ని ప‌రిశీలిస్తాం..
ఈడీ స‌మ‌యం కోర‌డంతోనే 24 కి వాయిదా

మద్యం పాలసీ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణను ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. తదుపరి విచారణను మే 24వ తేదీకి వాయిదా వేసింది. బెయిల్ కోరుతూ కవిత మొదట రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ చుక్కెదురు కావడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు.

కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని, అయితే విచారణ అనంతరం నిర్ణయం వెలువరిస్తామని కోర్టు తెలిపింది. అయితే ఈ బెయిల్ పిటిషన్‌పై వాదనలకు ఈడీ సమయం కోరింది. దీంతో విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది. గడువులోగా ఈడీ తన స్పందనను తెలియజేయాలని జస్టిస్ స్వరణ కాంత శర్మ ఆదేశించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement