Monday, June 24, 2024

AP | తిరుమలలో మరోసారి చిరుతపులుల కలకలం.. మెట్ల మార్గంలో సంచారం

తిరుమలలో మరోసారి చిరుతలు సంచరిస్తున్నట్లు గుర్తించారు. సోమవారం (మే 20) అలిపిరి వాక్ మెట్లపై రెండు చిరుత పులులు సంచరిస్తూ కనిపించాయి. భక్తులు పెద్దగా కేకలు వేయడంతో చిరుతలు అడవిలోకి పారిపోయినట్లు సమాచారం. భక్తుల నుంచి సమాచారం అందుకున్న టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిరుతపులి జాడలను గుర్తించేందుకు అటవీశాఖ సిబ్బంది రంగంలోకి దిగారు.

మే 15న సైతం చిరుత సంచారం తిరుమలలో కలకలం రేపింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో భక్తుల కారుకు చిరుత అడ్డుగా వచ్చింది. సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. దాంతో టీటీడీ సిబ్బంది అలర్ట్ అయ్యారు. భక్తులు జాగ్రత్తగా ఉండాలని, గుంపులుగా వెళ్లాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement