Thursday, June 6, 2024

Kiara Advani : కియారా న్యూ స్టైల్…

రోమ్ వెళితో రోమ‌న్‌లా ఉండాల‌ని అంటారు.. కానీ కేన్స్ కి వెళ్లిన కియ‌రాకు ఏమైందో తెలిస్తే షాక్ అవుతారు! డీప్ గా వివ‌రాల్లోకి వెళితే.. అందాల క‌థానాయిక‌ కియారా అద్వాణీ 2024 కేన్స్‌లో అరంగేట్రం చేసింది. ఈవెంట్లో కియ‌రా హంగామా ఆషామాషీగా లేదు. ఈ బ్యూటీ సంద‌డికి సంబంధించిన ఒక స్పెష‌ల్ వీడియో తాజాగా వైరల్‌గా మారింది.

కియారా ఫ్రెంచ్ రివేరాలో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా మారింది. క్రేప్ ఐవరీ గౌనులో ఈ బ్యూటీ ఫస్ట్ లుక్ .. అందమైన నారింజ రంగు దుస్తులలో రెండవ లుక్ ఇప్ప‌టికే వైర‌ల్ అయ్యాయి. కియారా అద్వానీ మూడవ ప్రదర్శనగా .. సినీరంగానికి చెందిన‌ మహిళలను గౌరవించడం కోసం రెడ్ సీ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన‌ గాలా డిన్నర్‌కు హాజరయ్యింది.

- Advertisement -

ఈ పార్టీలో కియారా అద్వాణీ లేస్ గ్లోవ్స్‌తో పింక్ అండ్ బ్లాక్ గౌనులో అద్భుతంగా కనిపించింది. ఈ కార్యక్రమానికి హాజరవడం ఎంత గౌరవంగా భావిస్తోందో తెలిపిన వీడియో వైరల్‌గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement