Saturday, July 27, 2024

హీరోయిన్ గా పైలెట్…

పైలట్ హీరోయిన్ గా మారనుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తన డెబ్యూ మూవీతో రానుంది. ఆమెనే ప్రార్థనా ఛాబ్రియా. ఇప్పుడు అనేక భాషల్లో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేయడానికి సిద్ధంగా ఉంది ప్రార్థన. వరుస అవకాశాలు దక్కించుకునేందుకు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. రకరకాల ఔట్ ఫిట్స్ లో అలరిస్తోంది. లేటెస్ట్ గా వైట్ కలర్ లాంగ్ ఫ్రాక్ లో అందాలు ఆరబోసింది. అయితే ఇండస్ట్రీలో ఆమెకు మంచి ఆఫర్స్ వచ్చే అవకాశం ఉందని నెటిజన్లు చెబుతున్నారు.

ప్రార్థన అందాల విందు అదిరిపోయిందని అంటున్నారు. గ్లామరస్ పైలట్ అంటూ ఆమె పిక్స్ ను రీ షేర్ చేస్తున్నారు. అమ్మడి అందానికి ఫ్లాట్ అయ్యామని చెబుతున్నారు. నెట్టింట అంతా ఆమె కోసమే మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి ఇంకా ఫస్ట్ మూవీ రిలీజ్ కాకముందే మంచి ఫాలోవర్స్ సంపాదించుకుంటోంది ప్రార్థన.

- Advertisement -

మేకర్స్ దృష్టిని ఆకర్షించడానికి ట్రై చేస్తోంది. ఇక ఆమె డెబ్యూ మూవీని విషయానికొస్తే.. వివేక్ రాజారామ్ తెరకెక్కిస్తున్న ‘చిరో’ సినిమాలో యాక్ట్ చేస్తోంది ప్రార్థన. మిలియన్ స్డూడియోస్ బ్యానర్ పై ఎంఎస్ మంజూర్ నిర్మిస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

మూవీ అంతా ఒకే జోనర్ లో ఉండదని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లు వినికిడి. మరి ఫస్ట్ మూవీతో అందాల పైలట్ కమ్ హీరోయిన్ ప్రార్థన ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement