Tuesday, July 23, 2024

DC vs LSG | టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో….

ఐపీఎల్ 2024లో భాగంగా నేడు జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ – లక్నో సూపర్ జేయింట్స్ జట్లు తలపడనున్నాయి. కాగా, ఈ డూ ఆర్ డై మ్యాచ్ లో టాస్ గెలిచిన లక్నో బౌలింగ్ ఎంచుకుని… ఢిల్లీని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇక ఢిల్లీ హోం గ్రౌండ్ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభంకానుంది.3

జట్ల వివరాలు :

లక్నో సూపర్ జెయింట్స్ :

కేఎల్ రాహుల్ (c & wk), క్వింటన్ డి కాక్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, అర్షద్ ఖాన్, యుధ్వీర్ సింగ్ చరక్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్.

ఢిల్లీ క్యాపిటల్స్ :

అభిషేక్ పోరెల్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, షాయ్ హోప్, రిషబ్ పంత్ (c & wk), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, గుల్బాదిన్ నాయబ్, రసిఖ్ సలామ్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్.

- Advertisement -

ఇంపాక్ట్ ప్లేయర్స్:

ఢిల్లీ క్యాపిటల్స్ : లలిత్ యాదవ్, ప్రవీణ్ దూబే, ఇషాంత్ శర్మ, కుమార్ కుషాగ్రా, స్వస్తిక్ చికారా

లక్నో సూపర్ జెయింట్స్: దేవదత్ పడిక్కల్, ఆయుష్ బదోని, ప్రేరక్ మన్కడ్, కృష్ణప్ప గౌతమ్, మణిమారన్ సిద్ధార్థ్

ప్లే ఆఫ్ ఆశ‌ల్ల‌నీ ఈ మ్యాచ్‌పైనే

ఈ ఒక్క మ్యాచ్‌పైనే ఇరు జట్ల ప్లేఆఫ్ ఆశలు ఉన్నాయి. ఢిల్లీకి ఇదే ఆఖరి లీగ్ మ్యాచ్ కాగా… ఈరోజు గెలిస్తేనే ప్లే ఆప్స్ కు ఎంతో కొంత ఛాన్స్ ఉంటుంది. ఓడితే ఢిల్లీ ఇంటికి వెళుతుంది. అటు లక్నో సూపర్ జెంట్స్ పరిస్థితి కూడా అంతే. ఇవాళ రెండు జట్లు కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.

ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ 12 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. లక్నో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడింది. వీటిలో 6 గెలిచి, అదే సంఖ్యలో ఓడింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ 13 మ్యాచ్‌ల్లో 6 గెలిచి 7 ఓడింది. కానీ, మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా పాయింట్ల పట్టికలో ఢిల్లీ ఆరో స్థానంలో, లక్నో ఏడో స్థానంలో నిలిచాయి. అందుకే ఢిల్లీకి ఇది డూ ఆర్ డై పోటీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement