Sunday, April 28, 2024

WGL: హన్మకొండలో అగ్ని ప్రమాదం..

హన్మకొండ నయీంనగర్‌లో ఓ రిఫ్రిజిరేటర్ రిపేరింగ్ షాపులో సోమవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఆ ప్రదేశమంతా దట్టమైన పొగ కమ్ముకోవడంతో దుకాణాదారులు భయాందోళనకు గురయ్యారు.

వెంటనే షాప్ యజమాని గమనించి అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా, వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. అయితే షాపులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement