Thursday, May 9, 2024

TS: ఢీ అంటే ఢీ.. గట్టమ్మ ఆలయం వద్ద ముదిరిన వివాదం.. పలువురికి గాయాలు

ప్రభ న్యూస్ ప్రతినిధి, ములుగు : ములుగు జిల్లాలోని గట్టమ్మ ఆలయంలో పూజారులుగా తామంటే తామే అంటూ జాకారం గ్రామానికి చెందిన ముదిరాజ్ ల సామాజిక వర్గం, అలాగే ములుగులోని నాయక్ పోడ్ సామాజిక వర్గం మధ్య జరుగుతున్న వివాదం సోమవారం తీవ్ర ఉద్రిక్తలకు దారి తీసింది.

దీంతో ఇరుపక్షాలకు చెందిన పూజారులు గట్టమ్మ ఆలయం వద్దకు భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలో ఆలయంలో పూజారులుగా ఉండేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందని ముదిరాజ్ సామాజిక వర్గం.. కాదు మేం ఏళ్ల తరబడిగా పూజలు నిర్వహిస్తూ పూజారులుగా కొనసాగుతున్నామని ఇరుపక్షాల నేతల మధ్య మాటల యుద్ధం మొడలవ్వడంతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఇరువర్గాల ప్రజలు గుమికూడడంతో ఘర్షణ వాతావరణం నెలకొని ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే విషయం తెలుసుకున్న పోలీసులు గట్టమ్మ ఆలయం వద్దకు చేరుకొని… ఇరువర్గాల ప్రజలకు నచ్చజెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement