Monday, May 20, 2024

BJP vs MIM – పాత‌బ‌స్తీలో హై వోల్టేజ్ పాలిటిక్స్

ఏఐఎంఐఎం, బీజేపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం
హీటెక్కిస్తున్న‌ న‌వ‌నీత్ కౌర్ , అక్బరుద్దీన్ ల హాట్ కామెంట్స్
ఒక‌రి పై ఒక‌రు స‌వాళ్లు ప్ర‌తి స‌వాళ్లు
15 సెక‌న్లు ఇస్తే ఓవైసీ బ్ర‌ద‌ర్స్ ఎక్క‌డికో పంపేస్తామంటూ న‌వనీత్ కామెంట్స్
గంట తీసుకోండి.. ఇక్క‌డే ఉన్నా ర‌మ్మంటూ మ‌జ్లీస్ అధినేత స‌వాల్
ఈ ప్రకటనపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి డిమాండ్

అక్బ‌రుద్దీన్, న‌వ‌నీత్ కౌర్ ల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. ఒక‌రిపై ఒక‌రు స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు విరుసుకుంటూ తెలంగాణ పాలిటిక్స్ ను మ‌రోసారి హీటెక్కిస్తున్నారు. వీరు చేసిన కామెంట్స్ రాజ‌కీయ దూమారం రేపుతున్నాయి. పోలీసులు 15 నిమిషాలు పక్కకు జరిగితే తామేం చేయగలమో చూపిస్తామని ఎన్నిక‌ల ప్ర‌చారంలో అక్బరుద్దీన్ కీల‌క‌ వ్యాఖ్యల చేశారు. దీనిపై అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ స్పందించారు. అక్బరుద్దీన్ కు నేను సవాల్ విసురుతున్నా 15 నిమిషాలు ఎందుకు మాకైతే 15 సెకన్లు చాలు అన్నారు. ఆ 15 సెకన్లలోనే మీరు ఎక్కడి నుంచి వచ్చారో.. ఎక్కడికి వెళ్లిపోతారో మీకే తెలియదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నవనీత్ కౌర్ మాటలకు స్పందించిన ఏఐఎంఐం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. 15 సెకన్లు కాదు గంట సమయం తీసుకోండి.. ముస్లింలను ఏం చేస్తారో చేయండని సవాల్ విసిరారు. అధికారమంతా మీ దగ్గరే ఉంది.. ఎక్కడికి రమ్మంటే తాము అక్కడికి వస్తామన్నారు. నవనీత్ కౌర్ ప్రకటనపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం నిబంధనలను ఉల్లంఘించేలా బీజేపీ నేతలు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారన్నారు.

- Advertisement -

ఏఐఎంఐఎం కంచుకోట బ‌ద్ద‌ల‌వ్వ‌డం ఖాయం : న‌వ‌నీత్ కౌర్
ఏఐఎంఐఎం కంచుకోట‌లు బ‌ద్ద‌లు కాబోతున్నాయ‌ని న‌వ‌నీత్ కౌర్ అన్నారు. ఆ కుటుంబ కంచుకోట స్థానంలో మాధవీ లత సింహంలా పోటీ చేస్తున్నారన్నార‌ని, ఆమె ప్రచార శైలి ప్రజలను బాగా ఆకట్టుకుంటుందన్నారు. పాత‌బ‌స్తీ ఎన్నిక ప్ర‌చారంలో ఆమె మాట్లాడారు. ఎంఐఎం కాంగ్రెస్ పార్టీలు క‌లిసి బీజేపీ ఓడించాల‌ని చూస్తున్నాయ‌న్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో ఎంఐఎంకు మద్దతుగా కాంగ్రెస్ కూడా డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందని విమర్శించారు. హైదరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ ఈసారి తప్పకుండా మాధవి లతకు ఓటు వేస్తారని నేను ఆశిస్తున్నాను. హైదరాబాద్‌ను పాకిస్థాన్‌లాగా మార్చకుండా మాధవి లత తప్పకుండా అడ్డుకోగలదని.. ఆమెను గెలిపిస్తే అన్ని విధాల అభివృద్ధి చేస్తుందని అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్నంత‌కాలం హైద‌రాబాద్ ను పాకిస్థాన్ కానివ్వ‌మ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement