Tuesday, May 14, 2024

సర్పంచ్‌, గ్రామ కార్యదర్శిపై చర్యలు..

కేశంపేట : చేపల చెరువుల కేటాయింపుల్లో అవినితికి పాల్పడుతున్న సంతాపూర్‌ గ్రామ సర్పంచ్‌తో పాటు పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలంటూ మత్స్య సహాకార సంఘం కొత్తపేట ఆధ్వర్యంలో సంఘం సభ్యులు జాయింట్‌ కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌కు ఫిర్యాదు చేశారు. సంతాపూర్‌ గ్రామ శివారులోని నాలుగు చేపల చెరువులను తమ సంఘానికి జిల్లా అధికారులు గతంలో కేటాయించారు. నాటి నుండి చెరువులు తమ ఆధీనంలోనే ఉన్నాయి. ఈ మధ్య కొత్తగా వచ్చిన గ్రామ కార్యదర్శి హన్మంత్‌రెడ్డితో పాటు సర్పంచ్‌ అంజయ్య తమ గ్రామానికి చెందిన చెరువులను ఎవరికి ఇచ్చేది లేదని మత్స్యకారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తమ సంఘానికి ఉన్న చెరువులను గ్రామ కార్యదర్శితో పాటు సర్పంచ్‌కు రూ. 50వేలు ఇచ్చినట్లు తెలిపారు. రూపాయలు ఇచ్చినప్పటికి చెరువులపై మీకు ఎలాంటి హక్కు లేదని చేపలను గ్రామస్థుల ఆధ్వర్యంలో వేలం వేసి పట్టుకుంటున్నారు. గతంలో మండల ఎంపిడిఓకు తమ సమస్యలు విన్నవించిన పట్టించుకున్న పాపాన పోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయంగా అందాల్సిన చేపల చెరువుల హక్కులను తమకు ఇప్పించాలని అన్నారు. నిబంధనలు పాటించని సర్పంచ్‌, కార్యదర్శిపై చట్టపరమైన చర్యలు తీసుకోని న్యాయం చేయాలని వారు జిల్లా అదనపు కలెక్టర్‌ను కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement