Tuesday, May 14, 2024

పోలీసులు నా బండి ఇవ్వకపోతే చస్తా… ఫ్లైఓవర్ ఎక్కిన యువకుడు

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ ముందు హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై ఓ యువకుడు హల్ చల్ చేశాడు. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ ఫై హంగామా సృష్టించాడు. గతంలో మద్యం మత్తులో వాహనం నడిపి ట్రాఫిక్ పోలీసులకు సదరు యువకుడు పట్టుబడ్డాడు. అయితే అప్పటి నుంచి తన వాహనం తనకి ఇవ్వకుండా పోలీస్ స్టేషన్ చుట్టు తిప్పుతున్నారని మనస్దాపం చెంది ఫ్లై ఓవర్ ఎక్కాడు. నా బైక్ నాకు ఇవ్వకపోతే పై నుంచి దూకుతానని బెదిరించాడు.

దీనితో పరిసర ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కాగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ యువకుడిని కిందకు దించే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement