Wednesday, July 24, 2024

DC vs LSG | రాణించిన ఢిల్లీ బ్యాటర్లు.. లక్నో టార్గెట్ ఎంతంటే

ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో కీలక మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్లు రాణించారు. దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్… భారీ స్కోర్ సాధించింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లో 4 వికెట్ల నష్టానికి 208 పరుగులు బాదింది. ఖాతా తెర‌వ‌కుండానే ఓపెన‌ర్ జేక్ ఫ్రేజ‌ర్ మెక్‌గుర్క్(0) వెనుదిరిగినా.. అభిషేక్ పొరెల్(58) బౌండ‌రీల‌తో విరుచుకుప‌డ్డాడు. తొలి ఓవ‌ర్‌లోనే ఫ్రేజ‌ర్ ఔట‌య్యాక‌ షాయ్‌ హోప్(38) అండ‌గా పొరెల్ స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు.

హోప్ ఔట‌య్యాక క్రీజులోకి వ‌చ్చిన కెప్టెన్ రిష‌భ్ పంత్‌(33) తో రాణించాడు. ఇక ఆ తరువాత వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్ (57 నాటౌట్) దంచి కొట్టాడు. దీంతో ఢిల్లీ స్కోర్ రెండొందలు దాటింది. ఇక లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ రెండు వికెట్లు పడగొట్టగా… రవి బిష్ణోయ్, అర్షద్ ఖాన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. దీంతో 209 పరుగుల టార్గెట్‌తో లక్నో జేయింట్స్ బరిలోకి దిగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement