Thursday, May 6, 2021

మాస్కు ధరించకుంటే జరిమాన..

తాండూరు : ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించకుంటే, నిబంధనలు పాటించకుంటే జరిమానాలు చెల్లించుకోకతప్పదు. కరోనా నిబంధనలను కఠినతరం చేసిన ప్రభుత్వం నిబంధనలు పాటించకుంటే జరిమానాలు విధించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో తాండూరు పోలీసులు, మున్సిపల్‌ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో మాస్కు ధరించకుండా వ్యాపారం నిర్వహిస్తున్న కూరగాయల వ్యాపారికి రూ. 1వెయ్యి జరిమాన విధించారు. ఈ సందర్భంగా తనిఖీలో ఉన్న ఎస్‌ఐ గిరి మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని, కరోనా నిబంధనలు పాటించకుంటే జరిమానలు తప్పవని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News