Friday, April 26, 2024

పేదింటి ఆడబిడ్డలకు వరం కళ్యాణ లక్ష్మి : మంత్రి హరీశ్ రావు

సిద్దిపేట ప్రతినిధి : దేశంలో ఎక్కడ లేని విధంగా పేద ఇంటి ఆడ బిడ్డల పెళ్లి కోసం కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రవేశ పెట్టారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. శనివారం సిద్ధిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో చిన్న కోడూరు మండలంలోని 56 మంది లబ్ధిదారులకు రూ.56 లక్షల 6 వేల 496 , నంగునూర్ మoడలంలోని 78 మంది లబ్ధిదారులకు రూ.78 లక్షల 9 వేల రూపాయల చెక్కులను కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ లబ్దిదారులకు రాష్ట్ర మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహాయంతో ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లిల భారం తగ్గిందని తెలిపారు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ప‌థ‌కాల‌ను ప్రవేశపెట్టారన్నారు. కార్యక్రమంలో మంత్రి వెంట జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, మున్సిపల్ ఛైర్మన్ మంజుల రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఆర్డీఓ అనంత రెడ్డి, నంగునూరు, చిన్న కోడూరు మండల స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచ్ లు, మున్సిపల్ కౌన్సిలర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement