Wednesday, May 8, 2024

ముందరితండాలో విద్యుత్ శాఖ అధికారుల నిర్బంధం

పెద్దమందడి : విద్యుత్ బిల్లుల కలెక్షన్లకు వెళ్లిన అధికారులను తండావాసులు నాలుగు గంటల పాటు నిర్బంధించి గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు నిరసనకు దిగిన ఘటన శుక్రవారం పెద్దమందడి మండలంలోని ముందరి తండాలో చోటు చేసుకుంది. విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదని గతేడాది విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు చేసి 27 మందిపై కేసు నమోదు చేసినట్లు పెద్దమందడి విద్యుత్ శాఖ శ్రీకాంత్ శర్మ తెలిపారు. పెండింగ్ లో ఉన్న విద్యుత్ బకాయిలు వసూలు చేసేందుకు తనతో పాటు నలుగురు లైన్ మెన్ లతో కలిసి తండాకు వెళ్లగా తండావాసులు తమను గ్రామ పంచాయతీ కార్యాలయానికి వస్తే మాట్లాడుకుందామని మర్యాదపూర్వకంగా పిలిచి అనూహ్యంగా రూములో బంధించి నాలుగు గంటల పాటు నిర్బంధించారని ఆయన తెలిపారు. అధికారులను నిర్బంధించిన సమాచారం తెలుసుకున్న పెద్దమందడి పోలీసులు హుటాహుటిన తండాకు చేరుకొని తండా వాసులతో పాటు విద్యుత్ శాఖ అధికారులతో చర్చలు జరిపారు. ప్రధానంగా 18మంది లబ్ధిదారులు మీటర్లు మంజూరైన‌ప్ప‌టికీ అవి బిగించకుండా మినిమం బిల్లులు చెల్లిస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఆయన తెలిపారు. విజిలెన్స్ అధికారులు విధించిన పెండింగ్ బిల్లుల వసూలు కోసం తండాకు వెళ్లామని పోలీసుల రాకతో తండావాసులు శాంతించారని ఏఈ శ్రీకాంత్ శర్మ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement