Sunday, May 19, 2024

MBNR : గాలివాన భీభ‌త్సం

అచ్చంపేట రూరల్, మే,7(ప్రభ న్యూస్):అచ్చంపేట మండల పరిధిలోని నడింపల్లి గ్రామంలో సోమవారం రాత్రి కురిసిన గాలివానకి ఇంటి పైకప్పులు రేకులు కొట్టుకపోయాయి. నాగర్ కర్నూల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు మంగ‌ళవారం ఉద‌యం పలు ఇండ్లను పరిశీలించారు.

- Advertisement -

రేకులు కొట్టుకపోయిన ఇళ్లకు మళ్లి రేకులు వేసుకునేందుకు సహాయం చేస్తానని బాధితులకు భరోసా కల్పించారు. అ రేకులు కొట్టుకపోయిన వారికి అండగా ఉంటానని, మనోధైర్యంగా ఉండాలని వారికి భరోసా కల్పించారు. ఆయ‌న వెంట మున్సిపల్ చైర్మన్ నరసింహ గౌడ్, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement