Sunday, May 19, 2024

MBNR: మాజీ ఎమ్మెల్యే గువ్వల బాల‌రాజుకు చేదు అనుభవం

అచ్చంపేట, మే 6 (ప్రభ న్యూస్) : అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు లోక్ స‌భ‌ ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది. సోమవారం అచ్చంపేట మండలంలోని మన్నె వారి పల్లి గ్రామంలో బీఆర్ఎస్ లోక్ స‌భ అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

గతంలో మన్నె వారి పల్లి గ్రామానికి మెరుగైన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇప్పిస్తానని హామీ ఇచ్చి పది సంవత్సరాల తన పదవి కాలంలో ఎందుకు అమలు చేయలేదని, తప్పుడు హామీలతో మమ్మల్ని మోసం చేశారంటూ గ్రామస్తులు, యువత పెద్ద ఎత్తున నిరసిస్తూ, గువ్వల బాలరాజు గో బ్యాక్ అంటూ ప్రచార కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకొని నిరసన వ్యక్తం చేస్తున్నవారిని అక్కడి నుంచి పంపివేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement