Friday, April 26, 2024

సెల్వ‌మ‌ణికి షాక్ – హైద‌రాబాద్ లో షూటింగ్ చేయ‌నున్న హీరో విజ‌య్

తమిళ్ హీరోలు తమ సినిమా షూటింగులను తమిళనాడులోనే జరపాలని, వేరే రాష్ట్రాల్లో జరపకూడదని, అలా జరిపితే తమిళ్ సినీ కార్మికులకు పనిలేకుండా పోతుందని ఏపీ మంత్రి రోజా భర్త ఆర్.కె సెల్వమణి రీసెంట్ గా తెలిపారు. ఆయన ప్రస్తుతం ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే స్టార్ హీరో అజిత్ ను కలిసిన సెల్వమణి ఇదే విషయాన్నీ ఆయనతో చర్చించారని, ఆయన మాటలను అజిత్ అంగీకరించి ఇతర రాష్ట్రాల్లో షూటింగ్ చేయనని తెలిపినట్లు సమాచారం. ఇక ఇప్పుడు స్టార్ హీరో విజయ్ తన షూటింగ్ ను హైదరాబాద్ లో చేయడం వలన ఆయన ఆర్.కె సెల్వమణి మాటలను ఖాతరు చేయడం లేదా అని కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. పోనీ వంశీ- విజయ్ చిత్రం ఏమైనా బై లింగువల్ సినిమానా అంటే అది కాదని, అది కేవలం తమిళ్ సినిమానే అని విజయ్ అధికారికంగా ప్రకటించాడు. మరి తమిళ్ సినిమా కోసం విజయ్ హైదరాబాద్ లో షూట్ చేయడం ఎందుకు.. సెల్వమణి ప్రకటన ఇచ్చిన తరువాత కూడా విజయ్ సినిమా హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావడంతో సెల్వమణి కి హీరో విజయ్ షాకిచ్చారనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement