Saturday, May 4, 2024

Flash: దిశ పోలీస్ స్టేషన్ ఎదురుగా మహిళ ఆత్మహత్యాయత్నం

తిరుపతిలో దిశ పోలీస్ స్టేషన్ ఎదురుగా మహిళ హాల్ చల్ చేసింది. పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నం చేసింది. మహిళా పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసి మూడు నెలలు అవుతున్నా ఇంతవరకు తనకు న్యాయం జరగ లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈరోజు తన భర్తకు బెయిలు ఇస్తుండటంతో కలత చెందింది. మహిళల కోసం ఏర్పాటు చేసిన దిశ పోలీస్ స్టేషన్లలో మహిళలకు న్యాయం జరగలేదని మహిళా సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న డిఎస్పీ దిశ సంఘటన స్థలానికి వచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement