Friday, May 17, 2024

HYD: బంజారాహిల్స్‌ మెరిడియన్ స్కూల్‌తో గూడీబ్యాగ్ భాగ‌స్వామ్యం

హైదరాబాద్ : వ్యర్థ పదార్థాల నిర్వహణ, వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి అంకితం చేయబడిన భారతదేశంలోని అగ్రగామి స్టార్టప్, గూడీబ్యాగ్, బంజారాహిల్స్‌లోని మెరిడియన్ స్కూల్‌తో తమ భాగస్వామ్యాన్ని వెల్లడించటానికి, గూడీబ్యాగ్ అవార్డుల మొదటి ఎడిషన్‌ను ఆవిష్కరించడానికి హైదరాబాద్‌లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించింది. బంజారాహిల్స్‌లోని మెరిడియన్ స్కూల్ ప్రిన్సిపల్ నిషి రాణా, గూడీబాగ్ వ్యవస్థాపకుడు అండ్ సీఈఓ అభిషిక్ అగర్వాల్ మధ్య అవగాహనా ఒప్పందంపై సంతకాలు జరిగాయి.

ఈ కార్యక్రమానికి ఇండియన్ స్టార్టప్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు జేఏ చౌదరి, ఐఏఎస్ (రిటైర్డ్), తెలంగాణ ప్రభుత్వ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్, రెడ్ క్రాస్ సొసైటీ చైర్ పర్సన్, హైదరాబాద్ అండ్ ఐఏఎస్(రిటైర్డ్) అజయ్ మిశ్రా, టి హబ్ సీఈఓ మహంకాళి శ్రీనివాస్ రావు, సెరెండిపిటీ వ్యవస్థాపకుడు అండ్ కర్మవీర్ చక్ర అవార్డు గ్రహీత (ఐఎన్ఎస్టీడీ. బై యూఎన్ అండ్ ఐ కాంగో ). రుమానా సిన్హా సెహగల్ వంటి గౌరవనీయ అతిథులు హాజరయ్యారు. ఎకోసిస్టమ్ ఎనేబలర్ సస్టైనబిలిటీ పార్టనర్‌గా గూడీబ్యాగ్ కోసం కీలక పాత్రను సెరెండిపిటీ పోషించింది.

ఈసంద‌ర్భంగా గూడీబ్యాగ్ వ్యవస్థాపకుడు అండ్ సీఈఓ అభిషీక్ అగర్వాల్ మాట్లాడుతూ… బంజారాహిల్స్‌లోని మెరిడియన్ స్కూల్‌తో త‌మ భాగస్వామ్యాన్ని, గూడీబ్యాగ్ అవార్డుల మొదటి ఎడిషన్‌ను ఆవిష్కరించడం పట్ల తాము సంతోషిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాలు పర్యావరణ అనుకూల ప్రక్రియలను ప్రోత్సహించడం, పర్యావరణ సారథ్యం పట్ల త‌మ నిబద్ధతను నొక్కి చెబుతున్నాయన్నారు. కలిసి పనిచేయడం ద్వారా పర్యావరణంపై సానుకూల ప్రభావాన్ని సృష్టించగలమని, పర్యావరణ అనుకూల జీవనశైలిని స్వీకరించడానికి భవిష్యత్ తరాలను ప్రేరేపించగలమని తాము నమ్ముతున్నామన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement