Wednesday, April 24, 2024

తప్పిపోయిన చిలుక కోసం అన్వేషణ.. పట్టిస్తే నగదు బహుమతి

పెంపుడు జంతువులు అంటే చాలా మంది లైక్​ చేస్తారు. వాటిని ముద్దు చేసి, ఇష్టంగా పెంచుకుంటారు. తమ ఫ్యామిలీలో ఒక మెంబర్​గా వాటిని చూసుకుంటారు. అట్లాంటి సమయంలో కనుకు అవి తప్పిపోతే, మరెవరైనా వాటిని దొంగిలిస్తే ఇక వారి మనసు విలవిల్లాడిపోతుంది. వాటికోసం ఎంతో ఆరాటంగా వెతుకుతుంటారు. ఇట్లాంటి ఘటనే బుద్ధగయాలో జరిగింది. చాలా ఏళ్లుగా ఆ కుటుంబం ఓ రామచిలుక ను పెంచుకుంటోంది. దానికి ముద్దుగా పోపో అని పేరు పెట్టుకున్నారు. అయితే.. అది ఈ మధ్య తప్పిపోయింది. ఏప్రిల్​ 5వ తేదీ నుంచి అది కనిపించకుండా పోయిందని, దాన్ని కనిపెట్టిన వారికి నగదు బహుమతి ఇవ్వడానికి కూడా వాళ్లు రెడీ అయ్యారు. అయితే.. తప్పిపోయిన రామచిలుక కోసం సిటీలో పెద్ద ఎత్తున వాల్​ పోస్టర్లను అంటించారు. గయాలోని పిప్పరపాటి రోడ్డులో నివాసం ఉంటున్న శ్యామ్​దేవ్​ ప్రసాద్​గుప్తా, ఆయన భార్య సంగీత గుప్తా తమ చిలుక ఆచూకీ కోసం చేయని ప్రయత్నమంటూ లేదు. పక్షి ఫొటో ఉన్న పోస్టర్లు సిటీలో ప్రతి గోడపై, రద్దీగా ఉండే మార్కెట్ల దగ్గర అంటించారు.

ఇక.. ఆ పక్షి నెల రోజుల క్రితం ఇంటి నుంచి ఎగిరిపోయిందని.. ప్రత్యేక స్వరంతో పిలిస్తే గానీ అది పలకదంటున్నారు సంగీత గుప్తా. సమీపంలోని చెట్లపై ఉందేమో అని వెతుకుతూ దాన్ని తిరిగి తెచ్చుకునేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు. పోస్టర్లను అతికించడమే కాకుండా ఆన్‌లైన్‌లో ఫేస్‌బుక్ పోస్ట్ లు, వాట్సాప్ సందేశాల ద్వారా కూడా ప్రచారం చేస్తున్నారు. ఆ చిలుకను దాదాపు 12 ఏళ్లుగా పెంచుకుంటున్నామని సంగీత గుప్తా వెల్లడించారు. మా పక్షిని ఎవరు తీసుకెళ్లారో దయచేసి దానిని మాకు తిరిగి ఇవ్వండి. దానికి బదులుగా మీకు మరో మూడింటిని కొనుగోలు చేసి ఇస్తాము. అది ఒక పక్షి మాత్రమే కాదు.. మా కుటుంబంలోని ఒక మెంబర్”అని సంగీత గుప్తా జీరబోయిన స్వరంతో చెబుతుండడంతో అది విన్న చాలామంది కన్నీరు పెట్టకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement