Thursday, May 9, 2024

లయన్స్‌ క్లబ్‌ సేవా కార్యక్రమాలు..

గోదావరిఖని: లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ బాలాజీనగర్‌, రామగుండం సంయుక్త ఆధ్వర్యంలో ఎస్‌, పీ గ్లోబల్‌ సీఎస్‌ఆర్‌ ఫండ్స్‌ సహకారంతో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పెద్దంపేట గ్రామంలో మహిళలకు 10కుట్టు మిషన్లు, ఐదుగురు రైతులకు తాటిపత్రిలు, తబిత ఆశ్రమంలో 2 బీరువాలు, 2 బుక్‌ సెల్ప్స్, 8 ర్యాక్‌లు, లక్ష్మిపూర్‌ పీహెచ్‌సీలో ప్రజలకు నీడ కోసం 5పెద్ద గొడుగులను అందించారు. రూ. 1.50లక్షలను వెచ్చించి సేవా కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు చీల వేణుగోపాల్‌రెడ్డి, తమ్మనవేని కుమార్‌, లయన్స్‌ క్లబ్‌ చైర్మన్‌ బంక రామస్వామి, బేని గొపాల్‌ త్రివేది, లక్కం భిక్షపతి, గంగాధర్‌, మండల వెంకటేశ్వర్లు, రాజిరెడ్డి, మందల వెంకట రమణా రెడ్డి, అక్షయ్‌దీప్‌రెడ్డి, ఎస్‌ఐ శ్రీధర్‌, సర్పంచ్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement