Friday, May 3, 2024

సాయంత్రం ఐదు గంటలకు – నాగ చైతన్య ఏం అనౌన్స్ చేస్తాడు ?

అక్కినేని నాగార్జున నట వారసుడు అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం లవ్ స్టోరీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే సినిమా రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు.

ఇదిలా ఉండగా నాగచైతన్యకు సంబంధించి ఓ అప్డేట్ రానుందని ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ట్వీట్ చేసింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు నాగచైతన్య ఆ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను రివీల్ చేస్తున్నట్లుగా ఆహా సంస్థ తెలిపింది. అయితే లవ్ స్టోరీ సినిమా గురించా లేక ఇంకేమైనా అప్డేట్ ఉందా అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement