Friday, April 26, 2024

TS | ఇంటర్​ బోర్డు అకడమిక్​ క్యాలెండర్.. సెలవులు ఇవే..

తెలంగాణలో ఇంటర్​ బోర్డు ఎడ్యుకేషన్​ క్యాలెండర్​ని ప్రకటించింది. జూనియర్​ కాలేజీలు జూన్​1వ తేదీన రీ ఓపెన్​ అవుతాయని బోర్డు అధికారులు ఇవ్వాల (శనివారం) వెల్లడించారు. ఆ రోజు నుంచే క్లాసులు కూడా ప్రారంభమవుతాయని తెలిపారు. ఇక.. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TS BIE) 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక విద్యా క్యాలెండర్ వెలువరించింది. దీని ప్రకారం.. జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు దసరా సెలవులు, జనవరి 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయి. కాగా, ఇంటర్మీడియట్ విద్య కోసం ఈ ఏడాది మొత్తం 227 పని దినాలు ఉంటాయని బోర్డు తెలిపింది.

అకడమిక్​ ఇయర్​ 2023-24 కోసం.. ఎడ్యుకేషన్​ క్యాలెండర్​

* జూనియర్ కాలేజీల పునఃప్రారంభం: జూన్ 1

* మొదటి, ద్వితీయ సంవత్సరాల ఇంటర్మీడియట్ తరగతులు: జూన్ 1

- Advertisement -

* దసరా సెలవులు: అక్టోబర్ 19 నుండి 25 వరకు

* దసరా సెలవుల తర్వాత పునఃప్రారంభం: అక్టోబర్ 26

* అర్ధ సంవత్సర పరీక్షలు: నవంబర్ 20 నుండి 25 వరకు

* సంక్రాంతి సెలవులు: జనవరి 13 నుండి 16 వరకు

* సంక్రాంతి సెలవుల తర్వాత పునఃప్రారంభం: జనవరి 17

* ప్రీ-ఫైనల్ పరీక్షలు: జనవరి 22 నుండి 29 వరకు

* IPE ప్రాక్టికల్ పరీక్షలు 2024: ఫిబ్రవరి రెండవ వారం

* IPE థియరీ పరీక్షలు 2024: మార్చి మొదటి వారం

* వేసవి సెలవులు: ఏప్రిల్ 1 నుండి మే 31 వరకు

* అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు 2024: మే చివరి వారం

* 2024-25 విద్యా సంవత్సరానికి జూనియర్ కళాశాలల పునఃప్రారంభ తేదీ: జూన్ 1

Advertisement

తాజా వార్తలు

Advertisement