Friday, April 26, 2024

పాన్ ఇండియ‌న్ సినిమా “పుష్ప 2” ఓటీటీ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ భారీ డీల్

పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ లో హై బ‌జ్ ఉన్న సినిమాల‌లో సుకుమార్ తెర‌కెక్కిస్తున్న‌ పుష్ప 2 ఒకటి. ఇప్పటికే ఈ సినిమా ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త అప్డేట్ ల‌తో ప్రేక్ష‌కుల్లో ఎక్జైట్ మెంట్ క్రియేట్ చేస్తూనే ఉంది. దీంతో పుష్ప 2 ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ కి కూడా విపరీతమైన డిమాండ్ ఏర్ప‌డింది. కాగా, ప్ర‌ముక ఓటీటీ సంస్థ‌ Netflix భారీ ఆఫర్‌తో పుష్ప 2 OTT రైట్స్ కోసం ప్ర‌య‌త్నిస్తున్నట్టు తెలుస్తోంది.

Netflix పుష్ప 2 OTT రైట్స్ కోసం మునుపెన్నడూ లేని విధంగా డీల్‌ను అందిస్తోంది. ఈ పాన్ ఇండియ‌న్ సినిమా కోసం ఈ ఓటీటీ సంస్థ‌ భారతీయ సినిమాలోనే అతి పెద్ద డీల్ ను కుదుర్చుకోవడానికి ట్రై చే్స్తోంది. ఈ ఆఫర్ దాదాపు రూ.200 కోట్ల వాల్యుయేషన్‌లో ఉన్నట్లు సినీ వ‌ర్గాల‌ సమాచారం. మ‌రి ఈ పాన్ ఇండియ‌న్ ప్రాజెక్ట్ పుష్ప 2 పోస్ట్ థియేట్రికల్ OTT రైట్స్ ని ఓటీటీ సంస్థ‌ Netflix పొందగలదా? లేదా? అనేది తెలుసుకోవాలి అంటే మనం మ‌రి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement