Tuesday, April 30, 2024

NZB: ఇందూర్ ను.. స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతా… చాయ్ పే చర్చలోఎంపీ అరవింద్..

నిజామాబాద్ ప్రతినిధి, ఏప్రిల్ 26(ప్రభ న్యూస్): ఓటు వేద్దాం… ఓటు వేయిద్దాం, ఓటు హక్కు అమూల్యమైనదని యువత తప్పకుండా ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ ధర్మపురి అరవింద్ కోరారు. దేశ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసేది యువకులేనని, ప్రజలకు సేవ చేసి మంచి పనులు చేసే నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత యువకులపై ఉందన్నారు. శుక్రవారం నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ మైదానంలో నిర్వహించిన చాయ్ పే చర్చ కార్యక్రమానికి ఎంపీ ధర్మపురి అరవింద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈసందర్భంగా ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ… కేవలం ఒక వర్గం కోసమే కాంగ్రెస్ మేనిఫెస్టో ఏర్పాటు చేయడంపై మండిపడ్డారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడడం ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ హయాంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా దేశంలోని రైల్వే స్టేషన్ల ఆధునిరీకరణకు ప్రత్యేక నిధులు కేటాయించి కృషి చేశారని తెలిపారు. నిజామాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. రామరాజ్య స్థాపనకు కమలానికే పట్టం కట్టండని కోరారు. నిజామాబాద్ జిల్లాలో ఒక్కసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించండని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితులను పరామర్శించిన ఎంపీ ధర్మపురి అరవింద్ ..
నిజామాబాద్ జిల్లా కేంద్రం నుంచి బడా పహాడ్ కు వెళ్తుండగా మల్లారం అటవీ ప్రాంతంలో కొత్తపేట శివారులో వద్ద గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితులను ఎంపీ ధర్మపురి అరవింద్ పరామర్శించారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement