Monday, May 20, 2024

IPL : ముంబైకి నేడు డూ ఆర్ డై….

ఐపీఎల్ 2024 లో నేడు 48వ మ్యాచ్‌ లక్నో సూపర్ జెయింట్స్ , ముంబై ఇండియన్స్ జట్ల మధ్య లక్నోలోని ఎకానా స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు జరగనుంది. గత మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో లక్నో 7 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. అదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ముంబై 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఇరు జట్లు కూడా ఈ మ్యాచ్ గెలవాలని చూస్తున్నాయి. మరోవైపు లక్నో తో జరిగే ఈ మ్యాచ్‌లో ముంబై విజయం సాధించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ తప్పక గెలవాలి.

- Advertisement -

లక్నో సూపర్ జెయింట్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంలో ఉంది. ఈ జట్టు ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడగా, 5 విజయాలు సాధించింది. 4 మ్యాచ్‌లలో ఓటమిని ఎదుర్కొంది. మరోవైపు ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడగా మూడింటిలో మాత్రమే గెలవగలిగింది. దీంతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో(9) ఉంది. 10వ స్థానంలో ఆర్సీబీ జట్టు ఉంది.
ఇక ఈ మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు 45 శాతం గెలిచే అవకాశం ఉండగా, ముంబై ఇండియన్స్‌ జట్టుకు 55 శాతం ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో లక్నో సొంత మైదానంలో ఆ జట్టుపై ముంబై జట్టు విజయం సాధిస్తుందో లేదో చూడాలి మరి.

లక్నో సూపర్‌జెయింట్స్ ప్రాబబుల్ 11లో క్వింటన్ డి కాక్, రాహుల్ , మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, మాట్ హెన్రీ, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్.
ముంబై ఇండియన్స్ ప్రాబబుల్ 11లో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ , తిలక్ వర్మ, నెహాల్ వధేరా, హార్దిక్ పాండ్యా (c), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, మహ్మద్ నబీ, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా.

Advertisement

తాజా వార్తలు

Advertisement