Tuesday, July 23, 2024

AP | సాంకేతిక లోపంతో స్టార్‌ ఎయిర్‌ లైన్స్‌ విమానం రద్దు.. ప్రయాణికుల నిరసన

తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో ప్రయాణికులు నిరసనకు దిగారు. స్టార్ ఏలియన్స్ అకస్మాత్తుగా తన విమానాన్ని రద్దు చేసింది. మధ్యాహ్నం 3.10 గంటలకు రేణిగుంట చేరుకుని తిరిగి 4.20 గంటలకు గుల్బర్గా చేరాల్సి ఉండగా.. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా రేణిగుంట – గుల్బర్గా మధ్య విమానాన్ని రద్దు చేసింది. దీంతో మధ్యాహ్నం నుంచి వేచి ఉన్న ప్రయాణికులు అసహనానికి గురై ఆందోళనకు దిగారు.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో విమానయాన సంస్థల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులు రేణిగుంట విమానాశ్రయంలోనే నిరసనకు దిగటంతో విమానయాన సంస్థ యాజమాన్యం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు టికెట్ డబ్బులు వాపసు చేస్తామని సిబ్బంది చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement