Tuesday, May 21, 2024

RCB : ఆర్సీబి ప్లేఆఫ్ కి చేరాలంటే…

ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్‌కి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేరుకుంటుందా.? లేదా.? ఇప్పటిదాకా అందరిలోనూ మెదిలిన ప్రశ్న ఇది. అయితే ఇటీవల వరుసగా రెండు విజయాలు సాధించిన బెంగళూరు జట్టు.. తమ ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంటూ.. దూసుకుపోతోంది. గురువారం సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్.. అలాగే ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయాలను అందుకుంది. దీంతో ఆర్సీబీ ప్లేఆఫ్స్ అవకాశాలు ఇప్పటికైతే సజీవంగా ఉన్నాయి.

- Advertisement -

ఇదిలా ఉండగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చివరి నాలుగు మ్యాచ్‌ల్లోనూ తప్పనిసరిగా విజయాలు సాధించడమే కాదు.. నెట్ రన్‌రేట్‌ను కూడా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొదటి రెండు స్థానాలైతే ఆర్సీబీకి అసాధ్యం. ఇక చివరి రెండు స్థానాల్లో నిలబడాలంటే.. ఆర్సీబీ 14 పాయింట్లు సాధించాలి. ఇక బెంగళూరు 4వ స్థానంలో నిలబడితే.. ఆ జట్టు నెట్ రన్‌రేట్ మిగిలిన టీమ్స్ గెలుపోటములపై ఆధారపడి ఉంటుంది. ఆ మూడు టీమ్స్ రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చివరి స్థానంలో 14 పాయింట్లతో నిలవాలంటే.. పాయింట్ల పట్టికలో మొదటి మూడు స్థానాల్లో ఉన్న జట్లు 16 పాయింట్లతో తన రన్ పూర్తి చేసుకోవాలి. అలాగే మిగిలిన 6 జట్లు 12 పాయింట్లు మించకూడదు. ఒకవేళ ఇలా కుదరకపోతే.. 14 పాయింట్లతో చాలా జట్లు ఉంటే.. అప్పుడు ఆర్సీబీ తన నెట్ రన్‌రేట్ మంచిగా పెట్టుకోవాల్సి ఉంటుంది. కాగా, RCB మే 4న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో తలపడుతుంది. తర్వాత మే 9న ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో తలపడుతుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు IPL 2024లో తమ లీగ్ చివరి రెండు హోమ్ గేమ్‌లు.. మే 12న ఢిల్లీ క్యాపిటల్స్‌తో, మే 18న చెన్నై సూపర్ కింగ్స్‌తో ముగిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement