Wednesday, July 24, 2024

Gold Rate | ఆల్‌టైమ్ హై రేట్​.. హైద‌రాబాద్‌లో తులం బంగారం ₹75,160

  • 24 క్యారెట్‌ 10 గ్రాములు రూ.75,160
  • 22 క్యారెట్‌ తులం రూ.68,900
  • ఈ నెలలోనే 5 శాతం పెరిగిన రేట్లు

బంగారం ధరలు హైదరాబాద్‌లో ఆల్‌టైమ్‌ హైకి చేరాయి. ఇంతకుముందెన్నడూ లేనివిధంగా తులం బంగారం ధర ₹75 వేలకు పైగానే పలికింది. సోమవారం 10 గ్రాముల 24 క్యారెట్‌ పుత్తడి ధర తొలిసారి ఏకంగా ₹75,160గా నమోదైంది. 22 క్యారెట్‌ కూడా ₹68,900గా ఉంది. ఈ ఒక్కరోజే ₹540, ₹500 చొప్పున పెరిగాయి. మరోవైపు దేశ రాజధాని న్యూఢిల్లీలో గరిష్ఠంగా 24 క్యారెట్‌ పసిడి రేటు 10 గ్రాములు ₹ 75,310ని తాకింది. 22 క్యారెట్‌ కూడా ₹69,050గా నమోదైంది.

20 రోజుల్లో 5శాతం పైకి..
ఈ నెల మొదలు ఇప్పటిదాకా హైదరాబాద్‌లో గోల్డ్‌ ధర 5.1 శాతం ఎగబాకినట్టు మార్కెట్‌ గణాంకాలు చెప్తున్నాయి. మే 1న 22 క్యారెట్‌ పసిడి తులం ₹65, 550 గా ఉన్నది. అలాగే 24 క్యారెట్‌ పుత్తడి ₹71,510గా ఉన్నది. ప్రస్తుతం ₹68, 900, ₹75,160గా ఉన్నాయి. దీంతో 20 రోజుల్లో 22 క్యారెట్‌ బంగారం 10 గ్రాముల ధర ₹3,350, 24 క్యారెట్‌ పసిడి తులం ₹3,650 చొప్పున పెరిగినైట్టెంది.

- Advertisement -

ఈ పెరుగుదలకు కారణాలేంటంటే
దేశీయంగా బంగారం ధరలు ఇంతలా పెరుగుతుండటం వెనుక దేశ, విదేశీ కారణాలున్నాయని మార్కెట్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశీయ కారణాల్లో పెండ్లిళ్ల సీజన్‌ ఒకటైతే.. స్టాక్‌ మార్కెట్లలో తీవ్ర ఒడిదొడుకులు మరొకటి. మదుపరులు తమ పెట్టుబడి సాధనంగా బంగారాన్ని, ప్రధానంగా డిజిటల్‌ గోల్డ్‌ను చూస్తున్నారని చెప్తున్నారు. దీంతో డిమాండ్‌ సహజంగానే పెరుగుతున్నదని అంటున్నారు. ఇక రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) గోల్డ్‌ రిజర్వులను పెంచుకుంటూపోతుండటం కూడా ధరలకు రెక్కల్ని తొడుగుతున్నదనీ పేర్కొంటున్నారు.

విదేశీ కారణాల్లో ప్రధానంగా వినిపిస్తున్నది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీరేట్ల కోతల్ని ఆపేయడం, దీనివల్లే ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా బంగారాన్ని చూస్తున్నారని మెజారిటీ ఎక్స్‌పర్ట్స్‌ అభిప్రాయపడుతున్నారు. అలాగే భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, ముఖ్యంగా మిడిల్‌ఈస్ట్‌ దేశాల్లో నెలకొన్న పరిణామాలు సైతం గోల్డ్‌ ధరలను ఎగదోస్తున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. ఇజ్రాయెల్‌-హమాస్‌ సంఘర్షణలతోపాటు రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కూడా మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నట్టు చెప్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement