Tuesday, April 16, 2024

సూర్య‌ని ముద్దాడిన.. క‌మ‌ల్ హాస‌న్

త‌మిళ స్టార్ హీరో సూర్య‌ని ముద్దాడారు మ‌రో స్టార్ హీరో క‌మ‌ల్ హాస‌న్.. వివ‌రాల్లోకి వెళ్తే.. విక్రమ్ సినిమా రూపంలో క‌మ‌ల్ హాస‌న్ కి బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. ఈ మూవీలో స్టార్ న‌టులు విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సూర్యా ప్రధాన పాత్రల్లో నటించారు. ముఖ్యంగా సూర్య నటించిన రోలెక్స్ పాత్ర ఇండస్ట్రీని షేక్ చేసింది. సూర్య క్యారెక్టర్​కు సినిమా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తాజాగా ఈ విషయంపై కమల్ హాసన్ మరోసారి స్పందించారు. చెన్నైలో జరిగిన వికటన్ సినిమా అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న కమల్‌హాసన్‌.. ఓ విభాగంలో సూర్యకు అవార్డు అందించారు. రోలెక్స్‌ పాత్ర.. మా సినిమా మరెంతో మందికి చేరువయ్యేలా చేసింది. ఈ పాత్ర చేయడానికి అంగీకరించినందుకు సూర్యకు మరోసారి ధన్యవాదాలు. ఇది మేం చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయం. ఒక్క ఫోన్‌కాల్‌ చేసిన వెంటనే సూర్య ఈ పాత్ర చేయడానికి ఓకే అన్నారు అంటూ సూర్యని హత్తుకుని ఆయన నుదిటిపై కమల్‌ ముద్దుపెట్టుకున్నారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement