Saturday, April 27, 2024

లింగోజిగూడలో కాంగ్రెస్ గెలుపు – ధన్యవాదాలు తెలిపిన ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి

హైద‌రాబాద్ – కర్మన్ ఘాట్ – జి హెచ్ ఎం సి పరిధిలోని లింగోజిగూడ డివిజన్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది గత ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ అభ్యర్థి ఆకుల రమేష్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేయకముందే మృతిచెందడంతో ఎన్నిక అనివార్యమైంది కాంగ్రెస్ పార్టీ నుండి ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి బిజెపి నుండి ఆకుల అఖిల్ గౌడ్ తో పాటు ముగ్గురు ఇండిపెండెంట్లు పోటీలో ఉండగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి బిజెపి అభ్యర్థి అఖిల్ గౌడ్ పై 1272 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఎన్నికలకు ముందు బిజెపి పార్టీ ఏకగ్రీవం కోసం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కలవగా మానవతా దృక్పథంతో పోటీకి నిలబెట్టమని బిజెపి నాయకులకు హామీ ఇచ్చారు అక్కడి నుండే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ఫోన్ చేసి ఏకగ్రీవం కోసం ప్రయత్నం చేశారు కానీ కాంగ్రెస్ పార్టీ పోటీలో నిలిచింది మొత్తం 48 వేల 203 ఓట్లకు గాను కేవలం 13 వేల 591 ఓట్లు పోలయ్యాయి 38 మంది పోస్టల్ బ్యాలెట్ వేయగా 33 కాంగ్రెస్కు 5 ఓట్లు చెల్లలేదు 101 నోటా 188 ఓట్లు చెల్లుబాటు కాలేదు.

గెలిపించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులకు పాదాభివందనాలు,ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి
తన గెలుపు కోసం అహర్నిశలు కృషిచేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులకు పాదాభివందనం చేస్తున్నట్లు లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ గా గెలుపొందిన ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఈ గెలుపు రేవంత్ రెడ్డికి అంకితమన్నారు. ఇరవై ఒక్క సంవత్సరాల నుండి తనకు అండగా నిలిచి గెలుపు కోసం కృషిచేసిన పార్టీ కార్యకర్తలు అభిమానులు నాయకుల కృషి అభినందనీయమన్నారు. లింగోజిగూడ డివిజన్ లోతట్టు ప్రాంతం అయినందున గత సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు అనేక కాలనీలు ముంపుకు గురై ప్రజలు తీవ్ర నష్టాన్ని గురయ్యారని ఆయన అన్నారు. ఐదు సంవత్సరాలు జిహెచ్ఎంసి టాక్సిన్ రద్దు చేయాలని కౌన్సిల్ లో డిమాండ్ చేయనున్నట్లు తెలిపారు .ప్రధాన సమస్యలు ప్రజాప్రతినిధుల సహకారంతో అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తమ గెలుపు కోసం పార్టీలకతీతంగా కాలనీ సంక్షేమ సంఘాలు కృషి చేశారని తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement