Wednesday, May 8, 2024

శాంసంగ్ గెలాక్సీ ఏ సిరీస్‌ లో ఐదు కొత్త మోడల్స్

భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ శాంసంగ్ మంగ‌ళ‌వారం ఐదు నూతన మోడల్స్‌ (గెలాక్సీ ఏ 13/ఏ23/ఏ33, 5జీ/ఏ53, 5జీ/ఏ73 5జీ)ను తమ జాబితాకు జోడించింది. గెలాక్సీ ఏ సిరీస్‌కు ఇది పూర్తి పునరుద్ధరణ. దీనిలో అత్యంత ఆకర్షణీయమైన, మన్నికైన డిజైన్లు, ఆహ్లాదకరమైన నూతన రంగులు, ప్రతిష్టాత్మక తరహా ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్లు అత్యంత అందుబాటు ధరలో తాజా గెలాక్సీ ఆవిష్కరణలకు సమగ్రమైన ప్యాకేజీ అందిస్తాయి. తద్వారా అద్భుతమైన సాంకేతికతను ప్రతిఒక్కరికీ అందుబాటులోకి తీసుకువస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఏ 73 5జీ హై స్మార్ట్ ఫోన్స్ మిడ్ అండ్ ఏఎంపీ కేట‌గిరీ హెడ్ అక్షయ్ ఎస్. రావు మాట్లాడుతూ… శాంసంగ్‌ వద్ద గెలాక్సీ అనుభవంతో నిష్కా పట్యతను విశ్వసిస్తున్నామన్నారు. దీంతో పాటుగా అంతులేని అవకాశాలనూ అందిస్తున్నామన్నారు. గెలాక్సీ ఏ సిరీస్‌ ఈ నమ్మికను ప్రదర్శిస్తూ ప్రతిష్టాత్మక తరహా ఫీచర్లను అత్యంత అందుబాటు ధరల వద్ద అందరికీ చేరువ చేస్తున్నాయన్నారు. తాము విడుదల చేస్తోన్న ఐదు నూతన మోడల్స్‌ను వినియోగదారులకు అపరిమిత శైలి, శక్తి, వైవిధ్యతను అందించే రీతిలో తీర్చిదిద్దామన్నారు. గెలాక్సీ ఏ73 5జీ ఈ విభాగంలో అత్యుత్తమమైన 108 మెగా పిక్సెల్‌ ఓఎస్‌ కెమెరా, ప్రతిష్టాత్మకమైన ఫీచర్లు అయినటువంటి ఆబ్జెక్ట్‌ ఏరేజర్‌, ఏఐ ఫోటో రెమాస్టర్‌, ఫ్లూయిడ్‌ స్మూత్‌ 120 హెర్జ్‌ సూపర్‌ అమోలెడ్ ప్ల‌స్ డిస్‌ప్లే, పలు అర్థవంతమైన ఆవిష్కరణలు అయినటువంటి నీరు, మురికి ప్రతిరోధకత వంటి ఫీచర్లు సాటిలేని అనుభవాలను అందిస్తున్నామ‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement