Thursday, March 23, 2023

మరో వివాదంతో హైకోర్టుకు భూమా కుటుంబం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : దివంగత భూమా నాగిరెడ్డి , శోభానాగిరెడ్డి కుటుంబానికి చెందిన మరో వివాదం తెలంగాణ హైకోర్టుకు చేరింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలం మంచిరేవుల ప్రాంతంలో తన తల్లి పేరి ఉన్న 1000 గజాల స్థలంలో తనకు వాటా ఇప్పించాలని భూమా దంపతుల కుమారుడు జగ్‌విఖ్యాత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

ఈ కేసులో ప్రతివాదులుగా ఆ భూమిని కొనుగోలు చేసిన ఐదుగురు వ్యక్తులతోపాటు తన ఇద్దరు సోదరిమణులు భూమా అఖిల ప్రియ, భూమా మౌనికలను ప్రతివాదులుగా చేర్చారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement