Sunday, May 12, 2024

తగ్గుముఖం పడుతోన్న కూరగాయల ధరలు..

హైదరాబాద్ : కూరగాయల ధరలు అందరికీ అందుబాటు ధరల్లోనే లభిస్తుండడంతో సామాన్య ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. రెండువారాల క్రితం ఉన్నధరలతో పోలిస్తే ప్రస్తుతం మార్కెట్‌లో ధరలు బాగా తగ్గాయి. దీనికి కారణంగా తెలంగాణలో ఈసారి భారీగా కూరగాయల ఉత్పత్తులు పెరగడమేనని మార్కెటింగ్‌శాఖ అధికారులు తెలిపారు. అలాగే పక్క రాష్ర్టాలైన ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర నుంచి కూడా హైదరాబాద్‌నగరానికి కూరగాయల దిగుమతి బాగా పెరిగింది. నగరంలోని ప్రధాన హోల్‌సేల్‌ మార్కెట్‌లైన గుడిమల్కాపూర్‌, బోయిన్‌పల్లి, ఎల్‌బి నగర్‌, మాదన్నపేట వంటి మార్కెట్‌లతో పాటు రైతు బజార్లకు రోజూ భారీగానే కూరగాయల దిగుమతి జరుగుతోంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement