Tuesday, October 8, 2024

Rajasthan : త‌ల్లి అంతిమకర్మలకు వెళ్తూ… ముగ్గురు అనంత‌లోకాలకు

త‌ల్లి అంతిమ‌క‌ర్మ‌లు చేయ‌డానికి వెళ్తుండ‌గా రోడ్డు ప్ర‌మాదం సంభ‌వించింది. జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న ట్రక్కు కారును ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గుగు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న రాజస్థాన్ లోని దౌసాలో చోటు చేసుకుంది.

- Advertisement -

పోలీసు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదానికి గురైన కారుకు ఆవు అడ్డురావడంతో కారును పక్కకు ఆపారు. ఆ సమయంలో వేగంగా వేనుక నుంచి వచ్చిన ట్రక్కు.. రోడ్డుపై నిల్చున్న వారిని ఢీకొట్టింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

కుటుంబంతో సహా అహ్మదాబాద్ నుండి ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు వెళ్తుండగా దౌసాలోని ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ ప్రమాదం జరిగిందని డ్యూటీలో ఉన్న పోలీసు అధికారి జవాన్ సింగ్ తెలిపారు. మృతులు వారి అమ్మ అంతిమ కర్మలు చేయడానికి హరిద్వార్‌కు బయలుదేరినట్లు కారులో ఉన్న వారు తెలిపారు. అలాగే ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కటుంబ‌ సభ్యులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement