Wednesday, May 29, 2024

TS : బెట్టింగ్, జ‌ల్సాల‌కు అల‌వాటు ప‌డ్డ కుమారుడు… ప్రాణం తీసిన తండ్రి

ఓ యువ‌కుడు బెట్టింగ్‌, జ‌ల్సాల‌కు అల‌వాటు ప‌డి భారీ మొత్తంలో సోమ్మును పొగొట్టాడు. అయినా త‌ల్లిదండ్రులు మానేయాల‌ని మంద‌లించిన విన‌కుండా అదే ప‌థ‌లో కొన‌సాగ‌గా… విసుగుచెందిన తండ్రి కుమారుడు రాడ్డుతో దాడి చేసి హ‌త్య చేశాడు. ఈఘ‌ట‌న మెద‌క్ జిల్లాలో చోటుచేసుకుంది.

- Advertisement -

చిన్న‌శంక‌రంపేట మండ‌లం బగిరాత్‌పల్లికి చెందిన ముకేష్‌కుమార్(28) బెట్టింగ్, జల్సాలకు అలవాటు పడ్డాడు. బెట్టింగ్‌లు మానుకోవాలని కొడుకుని తండ్రి సత్యనారాయణ పలుమార్లు హెచ్చరించాడు. ఎన్నిసార్లు చెప్పినా ముకేష్ మారకపోవడంతో శనివారం రాత్రి కుమారుడిపై తండ్రి సత్యనారాయణ దాడి చేశాడు. ఇనుపరాడ్డుతో ముకేష్ తలపై బలంగా కొట్టడంతో తీవ్రగాయాలై కుమారుడు ముకేష్‌ కుమార్‌ ప్రాణాలు విడిచాడు. మృతుడు ముఖేష్ కుమార్ చేగుంట మండలం మల్యాలలో రైల్వే ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ముకేష్‌ బెట్టింగ్ వ్యసనం కారణంగా మేడ్చల్‌లోని ఆస్తులు అమ్ముకున్నామని కుటుంబసభ్యులు వెల్లడించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement