Thursday, July 25, 2024

RR : పోలింగ్ స‌ర్వ‌సిద్ధం… క‌లెక్ట‌ర్ రాహుల్ శ‌ర్మ

వికారాబాద్, మే 12 (ప్రభ న్యూస్): పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం నాడు జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో వికారాబాద్ నియోజకవర్గంలో మొత్తం 284 పోలింగ్ స్టేషన్‌లో ఎన్నికల నిర్వహణకు వెళ్లే సిబ్బంది కోసం 26 రోడ్లలో 54 బస్సులను ఏర్పాటు చేసినట్లు వికారాబాద్ నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.

- Advertisement -

ఆదివారం వికారాబాద్‌ జిల్లా కేంద్రంలోని మేరీ ఏ నాట్స్ పాఠశాలలో గల డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో సంబంధిత రూట్లక్కు సంబంధించిన సిబ్బందికి తగు సూచనలు సలహాలు ఇచ్చారు. ఆయా రూట్లో వెళ్లే పోలింగ్ స్టేషన్‌లో వివరాలు సిబ్బంది తదితర అంశాలను ఆయన సమగ్రంగా పరిశీలించారు. పోలింగ్ స్టేషన్‌లో విధులు నిర్వహించే వారితో పాటు అదనంగా ఉండాల్సిన సిబ్బంది సంబంధిత పోలింగ్ స్టేషన్లో కనీస వసతులు తదితరు అంశాలను ఆయన పరిశీలించారు. సిబ్బందికి తగు సూచనలు సలహాలు ఇచ్చారు ఎన్నికలు ప్రశాంత వాస్తవంలో జరిగేలా సిబ్బంది సహకరించాలని ఆయన కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement