Thursday, May 30, 2024

BREAKING : కారులో కోటిన్న‌ర‌…. త‌ప్పించుకునేందుకు య‌త్నం

ఖ‌మ్మం జిల్లాలో లోక్ స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో పోలీసులు వాహ‌నాల త‌నిఖీని చేప‌ట్టారు. నాయ‌క‌న‌గూడెం టోల్‌ప్లాజా వ‌ద్ద వాహ‌నాల త‌నిఖీ నిర్వ‌హిస్తుండ‌గా ఓ కారును త‌నిఖీ చేయాల‌నుకునే లోపు నిలుపకుండా వేగంగా తప్పించుకునేందుకు ప్రయత్నించింది. పోలీసులు పది కిలోమీటర్లు చేజింగ్ చేస్తున్న క్రమంలో కారు పల్టీకొట్టింది. అందులు రూ.కోటిన్నర నగదు బయటపడింది.

- Advertisement -

ఖమ్మం పోలీసుల వివరాల ప్రకారం.. రాష్ట్ర రాజధాని నుంచి ఖమ్మం వైపునకు ఓ ఇన్నోవా వెళ్తోంది. నాయకనగూడెం వద్ద పోలీసులు తనిఖీ లు చేస్తుండగా ఇన్నోవా కారు ఆపితే ఆగకుండా వెళ్లింది. సిబ్బందికి అనుమానం వచ్చి ఆ కారును చేజ్ చేశారు. పది కిలోమీటర్ల మేర పోలీసులు వాహనాన్ని తరిమారు. ఈ క్రమంలో దేవుడి తండా వద్ద ఇన్నోవా వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణం చేసిన ఒకరికి గాయాలు కాగా ఆ వాహనంలో కోటిన్నర రూపాయలు పైగా నగదు బయట పడింది. పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement