Sunday, April 28, 2024

మరో ‘లింకు’ పెడుతున్న కేంద్రం

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆధార్‌తో ఓటర్ ఐడీని అనుసంధానం చేస్తున్నట్లు పార్లమెంటులో ప్రకటించింది. డీఎంకే ఎంపీ దయానిధి మారన్ వేసిన ప్రశ్నకు లోక్ సభలో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమాధానమిచ్చారు. త్వరలోనే ఓటర్ ఐడీకి ఆధార్ నంబరును అనుసంధానం చేస్తామన్నారు. దీనివల్ల ఓటు హక్కు పరిరక్షణకు వీలవుతుందని అన్నారు. ఎవరు ఓటు వేశారో, ఎవరు వేయలేదో తెలుసుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పారు.

ఓటర్ ఐడీకి ఆధార్‌ను అనుసంధానం చేయాలనే డిమాండ్లు ఎప్పటి నుంచో వినపడుతున్నాయి. ఆధార్‌తో అనుసంధానిస్తే నకిలీ ఓట్లు తొలగిపోతాయని కేంద్ర ఎన్నికల సంఘం కూడా అభిప్రాయపడింది. ఓటర్ ఐడీని ఆధార్ తో అనుసంధానం చేస్తే… నకిలీ ఓట్లను సులభంగా తొలగించవచ్చు. ఒక్కొక్కరు కేవలం ఒక ఓటుకు మాత్రమే పరిమితమవుతారు. రెండు, మూడు చోట్ల ఓటరుగా నమోదు చేసుకోవడం కుదరదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement