Thursday, May 2, 2024

HYD: డిజైన్ షో- డిజైన్ వాన్‌గార్డ్ 2024ను నిర్వహించిన వోక్స్‌సెన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ డిజైన్

హైదరాబాద్: నూతన యుగపు డిజైన్ ఎక్సలెన్స్‌ను వేడుక చేసుకుంటూ ఈ రంగంలో వర్ధమాన ప్రతిభావంతులకు తమ పనితనాన్ని ప్రదర్శించేందుకు అవసరమైన వేదికను అందజేస్తూ వోక్స్‌సెన్ యూనివర్సిటీ హైదరాబాద్‌ నగరపు మొదటి డిజైన్ షో డిజైన్ వాన్‌గార్డ్ 2024ను హైదరాబాద్‌లోని టీ-వర్క్స్‌లో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో క్లైమేట్ చేంజ్, మెడ్‌టెక్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, క్రాఫ్ట్ ఇన్నోవేషన్, ఇన్‌క్లూజివ్ డిజైన్, మెంటల్ వెల్‌నెస్ అండ్ హెరిటేజ్ కన్జర్వేషన్ వంటి సామాజిక సంబంధిత, ముఖ్యమైన అంశాలపై ఇరవై వినూత్న ప్రాజెక్టులను ఆవిష్కరించారు.

సమకాలీన సవాళ్లను పరిష్కరించడంలో, డిజైన్ ఆవిష్కరణ ద్వారా మెరుగైన భవిష్యత్తును రూపొందించడంలో విశ్వవిద్యాలయం నిబద్ధతను ఇది ప్రదర్శించింది. ఈ కార్యక్రమం వోక్స్‌సెన్ విశ్వవిద్యాలయంలో ప్రతిభావంతులైన విద్యార్థుల అత్యుత్తమ నైపుణ్యంను ప్రదర్శించింది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ నటుడు, దర్శకుడు అడివి శేష్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్ అరుణ్ కుమార్- డైరెక్టర్ అండ్ హెడ్ ఆఫ్ ఆఫీస్ డెవలప్‌మెంట్ కమిషనర్ ఆఫ్ హ్యాండ్లూమ్స్, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్‌టైల్స్, భారత ప్రభుత్వం (హైదరాబాద్), సేల్స్‌ఫోర్స్‌లో యూజర్ ఎక్స్‌పీరియన్స్ సీనియర్ డైరెక్టర్, మైక్రోసాఫ్ట్‌ మాజీ యూఎక్స్ డైరెక్టర్ పరాగ్ త్రివేది, ఒప్పో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ – తస్లీమ్ ఆరిఫ్, ఎక్సెల్ప్మోక్ డిజైన్ అండ్ టెక్ లిమిటెడ్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ కొల్లిపర, (మికా) జావో, బర్మింగ్‌హామ్ సిటీ యూనివర్శిటీలో మేనేజ్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో లెక్చరర్, తదితతరులు పాల్గొన్నారు.

అనంత‌రం న‌టుడు, ద‌ర్శ‌కుడు అడ‌విశేష్ మాట్లాడుతూ… డిజైన్ వాన్‌గార్డ్ అందంగా ఉందని, వోక్స్‌సెన్ విశ్వవిద్యాలయం ఇక్కడి విద్యార్థులతో అద్భుతమైన రీతిలో పని చేస్తోందన్నారు. డిజైన్ విద్యార్థులచే నడపబడే జె.కార్క్ ఈ ఈవెంట్‌లో అరంగేట్రం చేసిందన్నారు. డీన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ డిజైన్ వోక్సేన్ యూనివర్శిటీ డాక్టర్ ఆదితి సక్సేనా మాట్లాడుతూ… పరిశ్రమ మారుతున్న అవసరాలను, అభివృద్ధి చెందుతున్న అవకాశాలను గుర్తించి, అసాధారణమైన ప్రతిభావంతులైన డిజైన్ విద్యార్థులు తమ ఉత్తమ పనిని, వినూత్న భావనలు ప్రదర్శించడానికి వేదికను సృష్టించడం చాలా కీలకమ‌న్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement