Wednesday, May 8, 2024

ఘ‌న హ‌వాలా….

250 కిలోల బంగారం అక్రమంగా దారిమళ్లింపు

ఈడీ సోదాలు

భారీగా హవాలా లావాదేవీలు

హైదరాబాద్‌, : ఘనశ్యామ్‌ జువెల్లర్స్‌ యజమాని కుమారుడు ప్రీత్‌ కుమార్‌ అగర్వాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్టు చేసింది. బంగారం అక్రమ రవాణా కేసులో ఆయనను అరెస్టు చేసినట్లు ఈడీ పేర్కొంది. ఎగుమతి చేసే బంగారం విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు ఆయనపై అభియోగాలు గతంలోనే నమోద య్యాయి. కోల్‌కతా విమానాశ్రయంలో ఈడీ అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకు న్నారు. అనంతరం జరిపిన దర్యాప్తులో ప్రీత్‌కుమార్‌ బంగారం ఎగుమతి పేరుతో దాదాపు 250 కిలోల బంగారాన్ని అక్రమంగా దారి మళ్ళించినట్లు డీఆర్‌ఐ కేసు నమోదు చేసింది. ఈ కేసు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఈడీ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలలో సోదాలను కూడా నిర్వహించింది. ఈ సోదాలలో లభించిన ఆధారాల మేరకు పెద్ద ఎత్తున హవాలా లావాదేవీలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. అక్రమార్జనతో ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. దర్యాప్తులో లభించిన ఆధారాలు, సేకరించిన వివరాల ఆధారంగా మరింత సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రీత్‌కుమార్‌ అగర్వాల్‌ను అరెస్టు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement